News June 24, 2024
ఆదిలాబాద్: అంగన్వాడీ టీచర్లకు 3రోజులు శిక్షణ తరగతులు

జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా నూతన పాఠ్య ప్రణాళికల్లో జరిగిన మార్పులపై ఆదిలాబాద్లో అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభించారు. దీనికి ఐసీడీఎస్ సీడీపీఓ వనజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్య వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. సూపర్వైజర్లు ఫర్హా, విజయలక్ష్మి, నీరజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
KCR కుటుంబంలో పైసల పంచాయితీ: సీఎం

ప్రజల సొమ్ము తిన్న వారు ఎవరు బాగుపడరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలు అడ్డగోలుగా సంపాదించిన BRS పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఇప్పుడు KCR కుటుంబంలో పైసల పంచాయితీ నడుస్తుందని ఎద్దేవా చేశారు. కొడుకు KTR ఒకవైపు, బిడ్డ కవిత మరో వైపు, KCR ఫామ్ హౌస్లో ఉన్నారని విమర్శించారు.
News December 4, 2025
ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి: CM

ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవార ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చేవి కావని గుర్తు చేశారు. సచివాలయానికి రానివ్వకుండా తనను, మంత్రి సీతక్కను అడ్డుకున్నారని తెలిపారు.
News December 4, 2025
ADB: ‘సైనికుల సహాయార్థం విరాళాలు అందించాలి’

దేశ రక్షణకు సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సైనిక పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఎన్సీసీ క్యాడెట్లు జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తారన్నారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణకు శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.


