News May 25, 2024
ఆదిలాబాద్: అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

పలు జిల్లాల్లో దొంగతనాలు చేసిన నిందితుడిని సిద్దిపేట 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన రామారావు సిద్దిపేట 2 టౌన్, 3 టౌన్, చేర్యాల PSల పరిధితో పాటు ఆయా స్టేషన్లలోని మొత్తం 24 దొంగతనాలు చేసినట్లు గుర్తించారు. నిందితుడి నుంచి 47.70 తులాల బంగారం, 65 తులాల వెండి, రూ.34,500, స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News November 19, 2025
జైనథ్: 8 మంది దొంగల అరెస్ట్

ఈ నెల 14న జైనథ్లోని హాత్తిఘాట్ పంపుహౌస్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన రూ.4.8 లక్షల సామగ్రిని రికవరీ చేశారు. మంగళవారం 12 మందిపై కేసు నమోదు చేసి, ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. దొంగిలించిన సామగ్రి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక ఆటో, రూ.7,140 నగదును స్వాధీనం చేసుకున్నారు. సామగ్రి కొనుగోలు చేసిన స్క్రాప్ దుకాణదారుడిని కూడా రిమాండ్కు పంపినట్లు సీఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
News November 18, 2025
ఆదిలాబాద్లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.
News November 18, 2025
ADB: ఈ నెల 20న వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 20న వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లాలోని వయోవృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ, రిమ్స్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


