News February 15, 2025
ఆదిలాబాద్: అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
Similar News
News October 31, 2025
ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38L క్యూసెక్కుల వరద

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4.38 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా 69 గేట్ల ద్వారా సముద్రంలోకి జలాలను విడుదల చేస్తున్నారు. కృష్ణా నది తీర ప్రాంతాల్లో చేపల వేటను నిషేధించారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 12.9 అడుగుల నీటి మట్టం ఉండగా, మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కాగా మొంథా తుఫాను ధాటికి చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి.
News October 31, 2025
KNL: మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ

కర్నూలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ యువతకు ఉచిత ఉద్యోగ శిక్షణ అందిస్తున్నట్లు ఆ శాఖ అధికారి సబీహా పర్వీన్ తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షల కోసం సీఈడీఎం ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గలవారు https://apcedmmwd.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని తెలియజేశారు.
News October 31, 2025
కోటబొమ్మాళిలో చెట్టు ఉరేసుకొని ఒకరు సూసైడ్

కోటబొమ్మాళి(M) నరసింగపల్లిలోని తోటల్లో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. దీనిపై ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


