News June 5, 2024
ఆదిలాబాద్: అసెంబ్లీల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు

అసెంబ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ
సిర్పూర్ 19840 62956 71325
అసిఫాబాద్ 38597 73996 47056
ఖానాపూర్ 18520 61587 75106
ఆదిలాబాద్ 16265 77056 82394
బోథ్ 22472 65204 70118
నిర్మల్ 8264 64033 107603
ముధోల్ 12505 67501 105334
మొత్తం BRSకు 1,37,300 ఓట్లు, CONGకు 4,77,516, BJPకి 5,68,168 ఓట్లు రాగ 90,652 మెజార్టీ వచ్చింది.
Similar News
News September 18, 2025
పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.
News September 18, 2025
ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
News September 18, 2025
ఆరోగ్యమే మహాభాగ్యం: ఆదిలాబాద్ ఎంపీ

ఆదిలాబాద్లో నిర్వహించిన స్వస్త్ నారి సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరంలో ఎంపీ గోడం నగేశ్ పాల్గొన్నారు. బుధవారం హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో చేపట్టిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజశ్రీ షాతో కలిసి పేదలకు పథకం ద్వారా అందించే ఫుడ్ కిట్స్ను ఎంపీ పంపిణీ చేశారు. శిక్షణ కలెక్టర్ సలోని, జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.