News September 17, 2024

ఆదిలాబాద్: ఆర్టీసీ గమ్యం యాప్‌పై ప్రయాణికులకు అవగాహన

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టేజ్ వద్ద ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసి గమ్యం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ప్రయాణించే బస్సు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 29, 2024

మరాఠీ పాటల పోటీలలో రాణిస్తున్న ముధోల్ చిన్నారి

image

ముధోల్ మండల కేంద్రానికి చెందిన గడపాలె అంజలి ప్రముఖ మరాఠీ ఛానల్లో నిర్వహిస్తున్న “మీ హోణార్ సూపర్ స్టార్ చోటే ఉస్తాద్ సీజన్-3” సింగింగ్ షోలో అద్భుతంగా పాటలు పాడుతూ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా చిన్నారి చదువుతున్న పాఠశాల ప్రిన్సిపల్ ఆసంవార్ సాయినాథ్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి పాటల్లో రాణిస్తూ సెమీ ఫైనల్‌కు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

News September 29, 2024

ఆసిఫాబాద్: పాఠశాల గదిలోకి పాము

image

ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల మండలం కన్నెపల్లి యూపీఎస్ పాఠశాల తరగతి గదిలో శనివారం పాము రావడంతో విద్యార్థులు పరుగులు పెట్టారు. ఇలా గదులలోకి పాములు, తేళ్లు, క్రిమి కీటకాలు రావడంతో విద్యార్థులు భయందోళనకు గురవుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరుతున్నారు.

News September 29, 2024

దసరా నవరాత్రుల్లో బాసర అమ్మవారు దర్శనం ఇచ్చే అవతారాలు ఇవే

image

బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అలంకరిస్తామన్నారు. మొదటిరోజు శేలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడవరోజు చంద్రఘటా, నాలుగోరోజు కూష్మాండ అలంకరణ, ఐదోరోజు స్కదమాతగా, ఆరోరోజు కాత్యాయగాని, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజు మహాగౌరీగా, తొమ్మిదోజు సిద్ధిధాత్రిగా దర్శనమిస్తారని తెలిపారు.