News May 11, 2024

ఆదిలాబాద్: ఇంకా మరి కొన్ని గంటలే..!

image

పోలింగ్ సమయం సమయం సమీపిస్తుండటం, మరికొన్ని గంటల్లో ప్రచారానికి బ్రేక్ పడనుండటంతో పార్టీల నేతలు దూకుడు పెంచారు. అగ్రనేతలు మొదలుకుని ముఖ్య నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా.. ఈరోజు సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియనుంది.

Similar News

News February 15, 2025

నేడు ఆదిలాబాద్ జిల్లాలో వారికి సెలవు.. 

image

శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న బంజారా ఉద్యోగ, ఉపాధ్యాయులకు శనివారం స్పెషల్ క్యాజువల్ సెలవు ఇస్తున్నట్ల ఉత్తర్వులు జారీ అయ్యాయని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. బంజారా ఉపాధ్యాయ సోదరులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు.

News February 15, 2025

ఆదిలాబాద్: ‘పాఠశాలల అభివృద్ధికి నిధులు సద్వినియోగం చేసుకోవాలి’

image

పాఠశాలల అభివృద్ధి కోసం పీఎంశ్రీ కింద మంజూరైన నిధులు సద్వినియోగం చేసుకుని పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా విద్యా శాఖ అధికారులను సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని తెలంగాణ బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. కిచెన్ షెడ్, డార్మిటరీ, డైనింగ్ హాల్, తదితర వాటిని పరిశీలించి, పాఠశాలకు అవసరమైన మరమ్మతుల కోసం అంచనాల నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ సూచించారు.

News February 15, 2025

ADB: ‘మూల్యాంకనం విధుల నుంచి వారు తొలగింపు’

image

TUTF సంఘం నాయకుల ప్రాతినిధ్యం మేరకు పదో తరగతి మూల్యాంకన విధుల నుంచి అన్ని ఉపాధ్యాయ సంఘాల మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులను తొలగిస్తూ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ఉత్తర్వులు జరిచేసినట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీకాంత్, జలంధర్ రెడ్డి పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్యామలదేవిని కలిసి సమస్యను విన్నవించగా విద్యాశాఖ అధికారికి తగిన చర్యలు తీసుకోమని ఆదేశించినట్లు తెలిపారు. 

error: Content is protected !!