News May 26, 2024
ఆదిలాబాద్: ఈనెల 28 నుంచి డిగ్రీ పరీక్షలు

అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28 నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జిల్లా కేంద్రంలోని సైన్స్ డిగ్రీ కళాశాలలో ఉంటాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన హల్‌టికెట్లు ఈ https://www.braouonline.in/ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని సకాలంలో పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
Similar News
News March 14, 2025
BREAKING: ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హోలీ పండుగ వేళ ఆదిలాబాద్‌లో విషాదం జరిగింది. పట్టణంలోని ఎరోడ్రం సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళుతుండగా ఇద్దరు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారిని రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో రిషి కుమార్ అనే యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు ప్రేమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని సీఐ సునీల్ కుమార్ సందర్శించి దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 14, 2025
ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు SP అఖిల్ మహాజన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూచనలు చేశారు.★ వాహనాలు నడిపే వారిపై రంగులు చల్లుతూ ఇబ్బందులు కలిగించకూడదు★ ఇతరుల అనుమతి లేకుండా రంగులను పూయరాదు★ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు★ సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం శ్రేయస్కరం★ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు
News March 14, 2025
ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

విద్యా శాఖ కార్యదర్శి (FLN) విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసే అంశంపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాధికారులతో, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. AI ఆధారిత పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్ధులకు సులువుగా శ్రద్ధతో చదవడానికి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.