News December 22, 2024
ఆదిలాబాద్: ఈ ఏడాది 75 గంజాయి కేసులు నమోదు

ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అనే పదం వినపడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, అందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు తమ వంతు కృషి చేయాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 75 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 987.425 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. సుమారు రూ.2 కోట్ల 31 లక్షల 31 వేల 750 విలువ గల గంజాయి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
Similar News
News December 4, 2025
అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోండి: సీఎం

గ్రామాలను అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి అడ్డుకునే వారు, పంచాయితీలు పెట్టే వారితో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. ఏకగ్రీవం చేసుకునే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
News December 4, 2025
KCR కుటుంబంలో పైసల పంచాయితీ: సీఎం

ప్రజల సొమ్ము తిన్న వారు ఎవరు బాగుపడరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గత పది సంవత్సరాలు అడ్డగోలుగా సంపాదించిన BRS పార్టీ నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. ఇప్పుడు KCR కుటుంబంలో పైసల పంచాయితీ నడుస్తుందని ఎద్దేవా చేశారు. కొడుకు KTR ఒకవైపు, బిడ్డ కవిత మరో వైపు, KCR ఫామ్ హౌస్లో ఉన్నారని విమర్శించారు.
News December 4, 2025
ఎన్నికలు ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి: CM

ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలని ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవార ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష నాయకులకు అవకాశం ఇచ్చేవి కావని గుర్తు చేశారు. సచివాలయానికి రానివ్వకుండా తనను, మంత్రి సీతక్కను అడ్డుకున్నారని తెలిపారు.


