News March 22, 2025

ఆదిలాబాద్‌: ఈ నెల 24న JOB MELA

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్‌లో ఈ నెల 24న TSKC ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, TSKC కోఆర్డినేటర్ డా.శ్రావణి, ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. HDFC Bank & Axis Bankలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ ఉండి 30ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

ADB: వ్యక్తి హత్య.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

image

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు బుధవారం తీర్పునిచ్చారు. 2022, ఆగస్టు 21న జైనథ్ మండలం రాంపూర్‌కు చెందిన కొడిమెల ప్రభాకర్ పాత కక్షల కారణంగా కుట్ల రమేశ్‌ను కత్తితో పొడిచి చంపాడు. అప్పటి జైనథ్ ఎస్ఐ పెర్సిస్, సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. 18 మంది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారణలో నేరం రుజువైంది.

News March 26, 2025

వాటిని షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలి: MP నగేశ్

image

50% కంటే ఎక్కువ శాతం గిరిజనులు నివసిస్తున్న గ్రామాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని ఆదిలాబాద్ MP నగేశ్ కోరారు. బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల గిరిజనులకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు.

News March 26, 2025

ADB: ఆపదలో ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

బాల్య వివాహాల నివారణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని DCPU సిబ్బంది ప్రేమ్ అన్నారు. బుధవారం పట్టణంలోని KRK కాలనీ మక్కా మసీద్‌లో షుర్ ఎన్జీవో ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, ఫీల్డ్ సుపర్వైజర్ కిరణ్‌తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఒక వ్యవస్త పని చేస్తుందన్నారు. ఆపదలో ఉన్నవారు ఎవరికి భయపడకుండా డయల్ 100, 181,1098కి కాల్ చేయాలని సూచించారు.

error: Content is protected !!