News June 7, 2024
ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు రేపే లాస్ట్ డేట్

ఉమ్మడి ADB జిల్లా నిరుద్యోగ యువకులకు (NAC) ద్వారా అందించే శిక్షణకు దరఖాస్తు గడువు రెపటితో (జూన్ 8) ముగియనుందని న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగేంద్రం తెలిపారు. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, తదితర కోర్సుల్లో 3 నెలల ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఈ శిక్షణకాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 21, 2025
BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
ADB: డిసెంబర్‌లో TCA రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు TCA రాష్ట్ర సభ్యురాలు, జడ్పీ మాజీ ఛైర్పర్సన్ చిట్యాల సుహాసిని తెలిపారు. ఈ పోటీలు జిల్లా, జోనల్ స్థాయిలో తరువాత రాష్ట్ర స్థాయిలో ఉంటాయని వివరించారు. అండర్ 23తో పాటు 23ఏళ్ల వారికి నలుగురు క్రీడాకారులకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఆమెతో పాటు జోనల్ ఇన్‌ఛార్జ్ నరోత్తమ్ రెడ్డి ఉన్నారు.
News November 21, 2025
ADB: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్డ మృతి

గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి నిన్న పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాశ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.


