News March 13, 2025

ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారి రాజలి,స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు.అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఏజ్ లిమిట్-26లోపు.లాస్ట్ డేట్-ఏప్రిల్ 8. SHARE IT

Similar News

News December 16, 2025

అ పంచాయితీ కి 19 ఏళ్లుగా సర్పంచ్ లేడు.. అది ఎక్కడంటే

image

జిల్లాలో ఆ పంచాయతీ ది, అందులో 5 వార్డుల విచిత్రమైన పరిస్థితి. ఆ పంచాయతీ పరిధిలో ఒక్కరు కూడ ఎస్టీ తెగకు చెందిన వాళ్ళు లేకున్నా ఆ పంచాయతీ మాత్రం 19 ఏళ్లుగా ఎస్టీ గానే రిజర్వేషన్ కొనసాగుతూ వస్తుంది. దీంతో ఆ పంచాయతీకి సర్పంచ్ లేక ఉప సర్పంచే సర్పంచ్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఈ విచిత్రమైన పంచాయతీ తలమడుగు మండలంలోని రుయ్యాడి పరిస్థితి. దీంతో 19 ఏళ్లుగా సర్పంచ్, 5 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు.

News December 15, 2025

102 మంది సర్పంచ్‌లు కాంగ్రెస్ బలపర్చిన వారే: నరేష్ జాదవ్

image

జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందించారని, రెండో విడతలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నదని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. మొత్తం 156 గ్రామ పంచాయతీ స్థానాల్లో 102 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించారని, దీంతో ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

News December 15, 2025

వందశాతం పోలింగ్ లక్ష్యం: ADB కలెక్టర్

image

మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో 100శాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం గూగుల్ మీట్ ద్వారా ఎన్నికల పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోథ్, సోనాల, బజార్హత్నూర్, నేరడిగొండ, గుడిహత్నూర్, తలమడుగు మండలాల్లోని గ్రామాల్లో వందశాతం పోలింగ్ సాధించేందుకు కృషి చేయాలన్నారు.