News May 19, 2024

ఆదిలాబాద్: ఉచిత శిక్షణ.. అనంతరం JOB

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ యువకులకు NAC ద్వారా హైదరాబాద్‌లో జేసీబీ డ్రైవింగ్ 3 నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ ఇన్‌ఛార్జ్ రమేష్ పేర్కొన్నారు. శిక్షణ అనంతరం రూ. 25వేలతో కూడిన జాబ్ ఇప్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. పదవతరగతి పాస్ లేదా ఫెయిల్ వారు ఈనెల 22 వరకు జిల్లాలోని న్యాక్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News September 18, 2025

ఆదిలాబాద్: అత్యవసరమైతే 8712659953 నంబర్‌కు కాల్ చేయండి!

image

విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్& కామర్స్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డా.బేగం అన్నారు. గురువారం ఆ కాలేజీలో విద్యార్థులకు ఉమెన్ ఎంపవర్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. షీటీమ్ ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సుశీల మాట్లాడారు. ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, స్నాప్ చాట్, వాట్సాప్‌ను యువత అవసరం మేరకే వినియోగించాలన్నారు. ఆడపిల్లలలు అత్యవసర సమయాల్లో 8712659953 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

News September 18, 2025

ఆదిలాబాద్: ‘మిత్తి’మీరుతున్నారు..!

image

అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే లక్ష్యంగా.. రుణాలు ఇచ్చేటప్పుడు ఒక రేటు మాట్లాడి తిరిగి తీసుకునేటప్పుడు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులకు బలవుతున్న వారిలో తాజాగా ఇంద్రవెల్లిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో జిల్లా అంతటా పోలీసులు దాడులు చేసి సుమారు 30 మందిపై కేసులు నమోదు చేసినా, తీరు మారడం లేదు.

News September 18, 2025

పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.