News February 9, 2025
ఆదిలాబాద్: ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు

అన్ని విషయాలు బోధించే ఉపాధ్యాయులు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ ఉపయోగించే విధానాన్ని తెలుసుకొని ఉండాలని, ప్రతి రోజు వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు బోధన జరపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత జిల్లాలోని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో ఆయా భాష ఉపాధ్యాయులకు ఐఎఫ్పిలు ఉపయోగించే విధానంపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులకు డీఈవో సూచనలు చేశారు.
Similar News
News November 22, 2025
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.