News October 2, 2024
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్గా ఇలంబరితి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్గా రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్గా ఆయన్ను నియమించారు. జిల్లాల్లో పర్యటించడంతో పాటు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.
Similar News
News November 15, 2025
EVM గోదాంను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శాంతినగర్లోని EVM గోదాంను కలెక్టర్ రాజర్షి షా శనివారం తనిఖీ చేశారు. గోదాంలో భద్రపరిచిన యంత్రాల స్థితి, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా వ్యవస్థ, బ్యారికేడింగ్ వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరీక్షించారు. EVM-VVPATల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండకూడదన్నారు. ప్రతి నెలా నిర్వహణ పద్ధతులను కచ్చితంగా పర్యవేక్షించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.
News November 15, 2025
నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్లైన్ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
News November 15, 2025
దర్యాప్తు, పరిశోధన నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలి: ADB ఎస్పీ

హత్య, ఆత్మహత్య, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మరణం, నీటిలో మునిగి చనిపోయిన, ఇతర నేరాల దర్యాప్తుకు సంబంధించి పోలీస్ సిబ్బందికి 5 రోజుల పాటు శిక్షణ అందించారు. ఈ శిక్షణలో 21 మంది పాల్గొన్నారు. కోర్టులో నేరస్థులకు శిక్షలు పడినప్పుడు ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు. నేర స్థలాన్ని ఏర్పాటు చేసి శిక్షణను అందించారు. ఎఫ్ఐఆర్, కస్టడీ, అరెస్టు, రిమాండ్ అంశాలపై శిక్షణ అందించారు.


