News June 30, 2024
ఆదిలాబాద్: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాలు.. నరేశ్, సరస్వతికి సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే భార్య భర్తల గొడవ కారణంగానే శనివారం సరస్వతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే రిమ్స్‌కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News October 21, 2025
రైజింగ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: ADB కలెక్టర్

తెలంగాణ రైజింగ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా సూచించారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమన్నారు. తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేలో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సర్వేకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు www.telangana.gov.in/telanganarising వెబ్సైట్లో తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
News October 20, 2025
దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ

గిరిజనుల దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని కొమరం భీమ్ కాలనీలో సోమవారం వేడుకలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమమే దండారి ఉత్సవాలు అన్నారు. ఈ కార్యక్రమంలో తాటి పెళ్లి రాజు, కనపర్తి చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.
News October 20, 2025
పోలీసు అమరవీరుల వారోత్సవాల షెడ్యూల్ ఇదే

జిల్లాలో అమరులైన పోలీసుల జ్ఞాపకార్థం నిర్వహించే ఫ్లాగ్ డే (పోలీసు అమరవీరుల దినోత్సవం) వారోత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు ఘనంగా నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 21న హెడ్ క్వార్టర్స్‌లో అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్, ఎస్పీ నివాళులర్పిస్తారు. 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, సైకిల్ ర్యాలీ, 24న 2000 మంది విద్యార్థులతో 5కే రన్ ఉంటుంది.