News February 17, 2025
ఆదిలాబాద్: ఉరేసుకుని ఉపాధ్యాయుడి సూసైడ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మావలలో చోటుచేసుకుంది. SI విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వెంకటాపూర్కు చెందిన బానోత్ సంతోష్ (28) జైనూర్ మండలం జామిని గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆదిలాబాద్లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 28, 2025
సేంద్రియ మల్చింగ్ – ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

సేంద్రియ మల్చింగ్ మొక్క మొదళ్లకు మరీ దగ్గరగా కాకుండా కాస్త దూరంగా వేస్తే మొక్క కాండానికి హాని కలగదు. ఈ మల్చింగ్ ఎక్కువ దళసరిగా వేస్తే మొక్కకు నీరు, గాలి లభ్యత తగ్గిపోతుంది. ఇవి ఎక్కువ తడిస్తే చిన్న చిన్న క్రిములు, శిలీంధ్రాలు రావచ్చు. కాబట్టి, సేంద్రియ మల్చులను ఎండేలాగా తిప్పి గాలి అందే విధంగా చూసుకోవాలి. శీతాకాలం ముందు మల్చులు వేసుకుంటే మొక్క వేర్లకు, నేలకు చలి వల్ల కలిగే నష్టం తగ్గించుకోవచ్చు.
News October 28, 2025
20 రోజుల్లోనే జుట్టు పెరుగుదల.. గుడ్న్యూస్ చెప్పిన చైనా

బట్టతల సమస్య యువతను కలవరపెడుతోంది. చాలామందికి యుక్తవయసులోనే బట్టతల వచ్చేస్తోంది. అలాంటి వారికి నేషనల్ తైవాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ పరిశోధనలో సహజమైన కొవ్వు ఆమ్లాలతో తయారైన సీరం 20 రోజుల్లో జుట్టును పునరుద్ధరించిందని తెలిపారు. ఇది నిద్రాణంగా ఉన్న జుట్టు కుదుళ్ల మూల కణాలను మేల్కొల్పుతుంది. ఎలుకలతో పాటు ఓ ప్రొఫెసర్ కాలుపై ప్రయోగించగా అది సానుకూల ఫలితాలు ఇచ్చింది.
News October 28, 2025
పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్ప్రెస్), కోణార్క్ ఎక్స్ప్రెస్తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.


