News February 17, 2025
ఆదిలాబాద్: ఉరేసుకుని ఉపాధ్యాయుడి సూసైడ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా మావలలో చోటుచేసుకుంది. SI విష్ణువర్ధన్ వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వెంకటాపూర్‌కు చెందిన బానోత్ సంతోష్ (28) జైనూర్ మండలం జామిని గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నాళ్లుగా ఆదిలాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ ఆదివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2026
కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతికను ఉపయోగించండి: ఎస్పీ

కేసుల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పోలీసు సిబ్బందికి ఎస్పీ సునీల్ షొరాణ్ సూచించారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 36 మందిని అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ ఎం.జావళి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
News April 10, 2026
ఇరాన్ పాకిస్థాన్‌కు వెళ్లడం డౌటే?

USతో శాంతి చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లు సమాచారం. పాక్ వేదికగా జరగాల్సిన ఈ చర్చలకు వెళ్లాలని ఓ వర్గం వాదిస్తుంటే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు చర్చల్లేవని మరో వర్గం అంటున్నట్లు తెలుస్తోంది. ఈ అంతర్గత కలహాల మధ్య ఇరాన్ ప్రతినిధుల బృందం ఇంకా ఇస్లామాబాద్ చేరుకోలేదని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ ఇప్పటికే పాక్ పయనమయ్యారు.
News April 10, 2026
HYD: ట్రాఫిక్ చలాన్లకు ఫుల్ స్టాప్.. ఇక ‘కాంటాక్ట్‌లెస్’ పెనాల్టీలు!

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు Adaptive Traffic Control Systemలోని లోపాలను సవరిస్తూ కొత్త ఇన్వెస్టిగేటివ్ మాడ్యూల్‌ను ప్రవేశపెట్టారు. వాహనదారులను ఆపి ఇబ్బంది పెట్టకుండా AI కెమెరాల ద్వారానే 99% ఉల్లంఘనలను గుర్తించేలా లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను మార్చారు. తప్పుడు చలాన్ల వల్ల వచ్చే న్యాయపరమైన సమస్యలను అధిగమించడానికి ఈ సిస్టమ్‌ను తెస్తున్నారు. ‘సేఫ్టీ ఫస్ట్’ నినాదంతో ఈ ప్లాన్ అమలు కాబోతోంది.


