News March 18, 2025

ఆదిలాబాద్: ఎండల నేపథ్యంలో హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు 

image

ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. దింతో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేశారు. 7670904306 సెల్ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. ప్రజలు ఏమైనా సమాచారం కోసం సంప్రదించాలన్నారు.

Similar News

News March 19, 2025

రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్ సాధించిన ADB బిడ్డ

image

ఉట్నూర్ మండల కేంద్రంలోని శాంతినగర్‌కు చెందిన నాతోరి రవీందర్ ప్రభుత్వం విడుదల చేసిన HWO ఫలితాల్లో ప్రతిభ కనబర్చారు. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకును సాధించి అందరి మన్ననలు పొందారు. రవీందర్ ఉట్నూర్ కీబీ ప్రాంగణంలోని ప్రభుత్వ పీఈటీసీ లైబ్రరీలో చదివి ఉద్యోగం సాధించారు. రవీందర్‌ను పీఈటీసీ ప్రిన్సిపల్ మెస్రం మనోహర్, తోటి విద్యార్థులు అభినందించారు..

News March 19, 2025

ఉట్నూర్: యాక్సిడెంట్.. ఒకరి దుర్మరణం

image

ఉట్నూర్ మండలం ఘన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద మంగళవారం రెండు బైకులు ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ జైనూర్ మండలం గూడ మామడ గ్రామానికి చెందిన కుమ్రా భక్కు‌ను రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. గౌరు అనే మరోవ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎదురుగా బైక్‌ను ఢీ కొన్న చిచ్‌దరి ఖానాపూర్‌కు చెందిన వ్యక్తికి గాయాలతో చికిత్స పొందుతున్నాడన్నారు.

News March 19, 2025

ADB: రాష్ట్రస్థాయి జిజ్ఞాసలో మనోళ్లకే  మొదటి స్థానం

image

ADBలోని ప్రభుత్వ ఆర్ట్స్, కామర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు జిజ్ఞాసలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచారు. HYDలో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్ స్టడీ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వ పాలన శాస్త్రంలో “ఆరు గ్యారంటీల అమలుకు అవకాశాలు: ADBపై ఒక అధ్యయనం” అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బేగం వారిని అభినందించారు.

error: Content is protected !!