News June 6, 2024
ఆదిలాబాద్ ఎంపీకి మంత్రి పదవి వరించేనా..?

కేంద్రంలో మరోసారి NDA ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాష్ట్రం నుంచి మంత్రి పదవుల ఆశావహుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు గెలుపొందడంతో రాష్ట్రానికి ప్రాధాన్యం పెరిగింది. కాగా దేశంలో మెుత్తం 47 ఎస్టీ లోక్ సభ నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడెంనగేశ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందా అనే దానిపై చర్చ మెుదలైంది.
Similar News
News December 31, 2025
నూతన సంవత్సరం COME WITH BOOK: కలెక్టర్

జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజార్షిషా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను కలవడానికి వచ్చే సందర్శకులకు జిల్లా యంత్రాంగం తరఫున ఒక వినూత్నమైన, సామాజిక బాధ్యతతో కూడిన విజ్ఞప్తి చేశారు. COME WITH BOOK అనే నినాదంతో, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారు పిల్లల సాహిత్య పుస్తకాలను తీసుకువచ్చి పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా అందించాలన్నారు.
News December 31, 2025
బోథ్: పూణేలో ఆర్మీ జవాన్ మృతి

బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన జవాన్ కాసర్ల వెంకటేశ్(30) పూణేలో జరిగిన రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. జవాన్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డారా లేక మరేదైనా జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, కుమారుడు, తల్లి, సోదరుడు ఉన్నారు. జవాన్ మరణవార్తతో మర్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఆయన స్నేహితులు పూణేకు బయలుదేరారు.
News December 31, 2025
రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రహదారి భద్రతపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి ఆయన రహదారి భద్రతా, మాదక ద్రవ్యాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖ, R&B శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (Black spots) గుర్తించాలన్నారు.


