News April 3, 2025

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు IAF నుంచి పత్రం

image

ఆదిలాబాద్ పట్టణంలో నూతన ఎయిర్‌పోర్ట్‌ మంజూరు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. AIRPORT నిర్మాణానికి ప్రభుత్వం పంపిన వినతి పత్రాన్ని అంగీకరిస్తున్నామని, త్వరలో ఎయిర్‌పోర్ట్‌ వద్ద రోడ్లు, బిల్డింగ్ తదితర భవనాలను నిర్మిస్తామని పత్రంలో పేర్కొంది. దీంతో ఎయిర్‌పోర్ట్‌ కోసం పోరాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీ గోడం నగేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 22, 2025

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

image

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.

News November 22, 2025

నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

image

నార్నూర్‌లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్‌లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.