News October 4, 2024

ఆదిలాబాద్: ఏకంగా భాష నేర్చుకుని జాబ్ కొట్టింది..

image

ఉట్నూరు మండలం లక్కారం మసీదు ఏరియాలో నివాసముండే న్యాయవాది పవార్ వసంత్ కూతురు మౌనిక డీఎస్సీ ఉర్దూ మాధ్యమంలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ఇంటి చుట్టూ ఉన్న ముస్లింలతో ఉర్దూ భాషలో మాట్లాడటం చేసుకున్న ఆ యువతికి ఆ భాషే చివరకు ఉద్యోగాన్ని సాధించిపెట్టింది. ఎస్టీ విభాగంలో రెండు పోస్టులు రిజర్వు చేయడంతో ఆమెకు ఉద్యోగం దక్కడం లాంఛనమే. ఉర్దూ భాషను మిత్రులతో పాటు యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నట్లు మౌనిక తెలిపారు

Similar News

News October 4, 2024

నిర్మల్ : నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణను అందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందేలా వృత్తి నైపుణ్య శిక్షణలను అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు శిక్షణపై జిల్లాస్థాయి వృత్తి నైపుణ్య సొసైటీ ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి కల్పించేలా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించాలని ఆదేశించారు.

News October 4, 2024

బాసర: ‘సరస్వతి దేవిని దర్శించుకున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్’

image

బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యురాలు కుస్రం నీలాదేవి శుక్రవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

News October 4, 2024

ఆదిలాబాద్: వెబ్ అప్షన్స్ పెట్టుకోవడానికి నేడే LAST

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీజీ M.A ఎకనామిక్స్ M.Com రెగ్యులర్ కోర్సులలో రెండవ విడతలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈనెల 4వ తేదీవరకు గడువు ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం కోఆర్డినేటర్ చంద్రకాంత్ తెలిపారు. CPGET రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇతర వివరాలకై కళాశాలను సంప్రదించాలని కోరారు.