News June 17, 2024
ఆదిలాబాద్: ఏడాది నుంచి బాలికపై అత్యాచారం

బాలికపై ఆమె బంధువు మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)ను ఆమె బంధువు రాజమౌళి(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబీకులు అతడిని మందలించగా వారిని సైతం వేధించాడు. దీంతో వారు ఆదివారం 2టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.
Similar News
News December 4, 2025
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: డిజిపి

గ్రామపంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల, మతపరమైన సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News December 4, 2025
ADB: అధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలి

గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం జిల్లా అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు. ఆర్వో స్టేజ్ 2 జోనల్ అధికారులు వెంటనే పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లే రోడ్డు మార్గాలను పరిశీలించాలని వివరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.
News December 4, 2025
అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోండి: సీఎం

గ్రామాలను అభివృద్ధి చేసే వారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. అభివృద్ధి అడ్డుకునే వారు, పంచాయితీలు పెట్టే వారితో గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని హితవు పలికారు. ఏకగ్రీవం చేసుకునే గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.


