News May 21, 2024
ఆదిలాబాద్: ఓటేయడానికి ముందుకురాని మహిళలు

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 8,45,213 మంది ఉన్నారు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో 6,22,420 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి పోలింగ్ 73.64 శాతంగా నమోదైంది. అలాగే పురుష ఓటర్లు 8,04,875 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,99,108 మంది ఓటు వేశారు. వీరి పోలింగ్ శాతం 74.43గా నమోదైంది. 2,05,767 మంది పురుష ఓటర్లు ఓటు వేయలేదు. మహిళలే తక్కువ ఓటేశారు.
Similar News
News January 8, 2026
ADB: కేంద్రం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలి: సోయం

చట్ట బద్దత లేని లంబాడీలు ఎస్టీలు కాదని, కేంద్ర ప్రభుత్వం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయకేలను కలిసి నివేదిక అందజేశారు. తగిన ఆధారాలను, పార్లమెంట్ కమిటీల నివేదికలను మంత్రులకు అందజేశామని పేర్కొన్నారు.
News January 7, 2026
ADB: కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి: ఎస్పీ

ఆదిలాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు. నమోదైన ప్రతి ఒక్క కేసులో నిందితులు కోర్టుకు హాజరు అయ్యేవిధంగా సమన్లను జారీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోవడానికి లేకుండా చూడాలన్నారు. కోర్టుకు హాజరు కాని వారిపై ఎన్‌బీడబ్ల్యూలను తీసుకొని తగు చర్యలను చేపట్టాలన్నారు. కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలన్నారు.
News January 7, 2026
ADB: ఓటరు జాబితాలో లోపాలు ఉండొద్దు: ఎస్ఈసీ కమిషనర్

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా కమిషనర్‌కు వివరించారు.


