News September 27, 2024
ఆదిలాబాద్: ఓపెన్ డిగ్రీ ఫలితాలు విడుదల

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండో సంవత్సరం ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత తెలిపారు. 2024 జులైలో నిర్వహించిన రెండో సంవత్సరం 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఉమ్మడి జిల్లా విద్యార్థులు https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Similar News
News February 23, 2026
ఆదిలాబాద్: ఈ మండలాల్లో 2 రోజులు ‘భగీరథ’ నీటి సరఫరా బంద్

సీతగొండి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు ఆదిలాబాద్ రూరల్, బేల, జైనాధ్, మావల, తంసి, భీమ్పూర్, తలమడుగు, గుడిహత్నూర్ మండలాల్లోని 406 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. దీనితో ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని అధికారులు సూచించారు.
News February 23, 2026
నార్నూర్‌లో పెళ్లికి కట్నకానుకలు నిషేధం

నార్నూర్ మండలంలోని ఖైర్డాట్వ గ్రామంలో ఆదివారం గ్రామస్థులు కలిసి పెళ్లికి కట్నకానుకలను నిషేధిస్తూ తీర్మానించారు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వధువు మడావి పూర్ణబాయి పెళ్లి కోసం 100 కుటుంబాలు కలిసి రూ.26,551 నగదు పొదుపు చేసి అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావి నరాంజి రావు, జంగు, మోతిరాం, గోవిందరావు, తుకారాం తదితరులు పాల్గొన్నారు.
News February 23, 2026
తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


