News May 20, 2024

ఆదిలాబాద్: ఓపెన్ యూనివర్సిటీ RESULT OUT

image

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడవ సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ టి. ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులు పరీక్షలు రాయగా సోమవారం ఫలితాలు విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

Similar News

News December 8, 2024

లక్ష్మణ్‌చందా: 8 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి

image

నిర్మల్ జిల్లా లక్ష్మణ్‌చందాలోని ఓ గ్రామనికి చెందిన 8ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి శనివారం ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్(36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ సుమలత వెల్లడించారు.

News December 8, 2024

HYDలో రోడ్డు ప్రమాదం.. బెల్లంపల్లి విద్యార్థి మృతి

image

HYDలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లికి చెందిన విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ బస్తీ 17వ వార్డుకు చెందిన రవితేజ (21) హైదరాబాదులో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి బైక్ పై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి కింద పడ్డాడు. వెనకాల వస్తున్న లారీ అతనిపై నుంచి వెళ్లింది. దీంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

News December 7, 2024

ఆదిలాబాద్: ‘సోమవారం నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలి’

image

వచ్చే సోమవారం నుండి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రారంభించాలని, గడువులోగా పూర్తి చేయాలనీ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం కలెక్టరేట్ లో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పై గూగుల్ మీట్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు.