News August 12, 2024
ఆదిలాబాద్: ఓపెన్ DEGREE ప్రవేశాలకు దరఖాస్తులు
కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ నుంచి ప్రవేశాల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో UG/ PG/ డిప్లొమా/ సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూజీ, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆగస్టు 31వ తేదీ గడువు ఉంది.
Similar News
News September 12, 2024
జైనూర్ బాధితురాలిని పరామర్శించిన బీఎస్పీ ఎంపీ
జైనూర్‌లో ఇటీవల ఆదివాసీ మహిళపై అత్యాచారం జరగగా బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కాగా బాధితురాలిని ఆదిలాబాద్ బీఎస్పీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జంగు బాబుతో కలిసి బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News September 12, 2024
నిర్మల్: అన్నను నరికి చంపిన తమ్ముడు
అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు(35)ను కుటుంబ కలహాల కారణంగా అతడి తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 12, 2024
ASF: ‘మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి’
ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని బీసీ యువజన సంఘం జిల్లాధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మికు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.