News February 28, 2025

ఆదిలాబాద్: కనిపించకుండాపోయి.. శవమై తేలి

image

ఓ వ్యక్తి కనపడకుండా పోయి శవమై తేలిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ వన్ టౌన్ CI  సునీల్ కుమార్ వివరాలు.. ఖానాపూర్‌కు చెందిన సాయికుమార్ (28) ఈనెల 22 నుంచి కనపడడం లేదని సోదరుడు గణేశ్ 25న ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఖానాపూర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగా గురువారం శవమై కనిపించాడు. కుడి కన్నుకు ఆపరేషన్ కాగా కన్ను నుంచి నీరు, చీము కారుతుందని అది భరించలేక సూసైడ్ చేసుకున్నాడు.

Similar News

News March 21, 2025

ఖండాలలో నీటి సమస్య లేకుండా చర్యలు: కలెక్టర్

image

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాలలో నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. గ్రామం నుంచి 4 KM దూరంలో ఉన్న వాగు వద్ద బోర్వెల్ వేసి అక్కడి నుంచి పైపు లైన్ ద్వారా గ్రామంలోని GLSR ట్యాంకుకు నీరు సరఫరా చేస్తామన్నారు. రోజు ఉదయం 7గంటలకు, సాయంత్రం 6 గంటలకు 10,000 లీటర్ల నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

News March 21, 2025

ఆదిలాబాద్ డైట్ కళాశాలలో ఉద్యోగాలు

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి అర్హత గల అభ్యర్థులు తమ బయోడేటా, ఫోటోలతో ఈ నెల 22 నుంచి 24 లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులను నమూనా తరగతుల ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించారు.

News March 21, 2025

గుడిహత్నూర్‌లో క్లినిక్ సీజ్

image

గుడిహత్నూర్‌లోని ఓ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. సూర్యవంశీ అనే RMP వైద్యుడు తన పరిధికి మించి ఓ గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ పిల్స్ ఇచ్చారు. విషయం తెలుసుకున్న DMHO డా.నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు అధికారులు సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న RMPలు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని, పరిధికి మించి వైద్యం అందిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!