News March 20, 2024

ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా డా.సుమలత..?

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 2వ విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా డా.సుమలత పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఫోన్ రాగా ఆమె హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మొదట బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. బీజేపీ గోడం నగేశ్‌కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్‌లో చేరారు.

Similar News

News April 18, 2026

పోలీసులకు వారాంతపు సెలవులపై చర్యలు తీసుకోవాలి: ADB SP

image

పోలీసులకు వారాంతపు సెలవులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎండాకాలం దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లే సందర్భంలో రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమాలపై సమాచారం అందించిన సిబ్బందికి ప్రోత్సహిస్తామన్నారు.

News April 18, 2026

విధుల పట్ల అంకితభావంతో ఉండాలి: ADB SP

image

పోలీసు సిబ్బంది అంకితభావం, నిజాయితీతో విధులు నిర్వహించాలని SP అఖిల్ మహాజన్ ఆదేశించారు. శనివారం సెట్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సిబ్బందికి మార్గదర్శనం చేశారు. యూనిఫామ్‌ తప్పనిసరిగా ధరించాలని, ఎండాకాలం దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అరైవ్ అలైవ్ కృషిని అభినందిస్తూ.. రికార్డుల నవీకరణ, బాధితులతో మర్యాదపూర్వక ప్రవర్తన ఉండాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

News April 18, 2026

ఆదిలాబాద్: కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల భర్తీకి మున్సిపల్ కమిషనర్ జి.రాజు ప్రకటన విడుదల చేశారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక అనుభవం ఉన్న ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ), అల్పసంఖ్యాక వర్గాల (Minorities) నుంచి ఇద్దరు సభ్యులను (ఒకరు మహిళ) ఎంపిక చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.