News March 26, 2025
ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రక్షాళన..?

కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి పార్టీ కార్యకలాపాలపై ఫోకస్ పెట్టారు. రేపు ఢిల్లీలో DCC అధ్యక్షులతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెబెల్స్ పోటీచేయడంతో మాజీ DCC అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, సుజాత, సంజీవరెడ్డిలను సస్పెండ్ చేశారు. తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. రేసులో ADB అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది, TPCC ప్రధానకార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ZPTC గణేశ్‌రెడ్డి తదితరులున్నట్లు సమాచారం.
Similar News
News December 10, 2025
వందశాతం పోలింగ్ కు కృషి చేయాలి: ADB కలెక్టర్

వంద శాతం పోలింగ్ నమోదుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. పోలింగ్ నమోదు వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని, వివరాలను టి–పోల్ యాప్‌లో పొందుపరుస్తామని వివరించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌కు సీల్ వేసి ఏజెంట్లు సంతకాలు స్వీకరించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు.
News December 10, 2025
సమస్యలు సృష్టించిన 598 మంది బైండోవర్: ADB SP

ఇప్పటివరకు జిల్లాలో సమస్యలు సృష్టించేన 598 మందిని బైండోవర్ చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 20 మంది వద్ద ఉన్న ఆయుధాలను సేఫ్ డిపాజిట్ చేశామన్నారు. ఈ బందోబస్తులో ఫారెస్ట్, టీజీఎస్పీ, ఏసీటీపీసీ సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా వీహెచ్ఎఫ్ సెట్లను ఏర్పాటు చేశామని వివరించారు.
News December 10, 2025
6 మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు నేపథ్యంలో ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టర్ రాజర్షి షా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ప్రచారం ముగిసిన వెంటనే 6 మండలాల్లోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూసివేయాలని సూచించారు.


