News October 28, 2024
ఆదిలాబాద్: కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో కారు బోల్తా పడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్మూర్‌కు చెందిన బాలు, సాయిలు ఆదిలాబాద్‌లో జరిగే శుభకార్యానికి బయలుదేరారు. కాగా ఇచ్చోడ సమీపంలోని అగ్నిమాపక కార్యాలయం వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. కాగా ఇద్దరికి గాయాలు కాగా వారిని 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.
Similar News
News January 8, 2026
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ADB అధ్యక్షుడిగా రంగ ఆనంద్

ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని ఆదిలాబాద్‌లో నిర్వహించారు. గురువారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ రంగ ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా చిన్మయి వాజే, కోశాధికారిగా దారుట్ల సంజీవ్‌లను నియమించారు. అసోసియేషన్ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
News January 8, 2026
ADB: కేంద్రం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలి: సోయం

చట్ట బద్దత లేని లంబాడీలు ఎస్టీలు కాదని, కేంద్ర ప్రభుత్వం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయకేలను కలిసి నివేదిక అందజేశారు. తగిన ఆధారాలను, పార్లమెంట్ కమిటీల నివేదికలను మంత్రులకు అందజేశామని పేర్కొన్నారు.
News January 7, 2026
ADB: కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలి: ఎస్పీ

ఆదిలాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ల కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ అఖిల్ మహాజన్ సమావేశం నిర్వహించారు. నమోదైన ప్రతి ఒక్క కేసులో నిందితులు కోర్టుకు హాజరు అయ్యేవిధంగా సమన్లను జారీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోవడానికి లేకుండా చూడాలన్నారు. కోర్టుకు హాజరు కాని వారిపై ఎన్‌బీడబ్ల్యూలను తీసుకొని తగు చర్యలను చేపట్టాలన్నారు. కోర్టులలో శిక్షల శాతం పెరిగేలా కృషి చేయాలన్నారు.


