News October 29, 2024

ఆదిలాబాద్: కుటుంబసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.

Similar News

News November 6, 2024

ADB: నేటి పత్తి ధర వివరాలు ఇవే!

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,030గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ, ప్రైవేటు ధరలో ఎటువంటి మార్పులేదు. పత్తికి సరైన గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

News November 6, 2024

దిలావర్పూర్ : కులగణనను నిషేధించిన గ్రామస్థులు

image

దిలావర్‌పూర్‌లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గ్రామస్థులు నిరసన తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వారు ఓ కీలక లేఖ విడుదల చేశారు. నేటి నుంచి చేపడుతున్న కులగణన కార్యక్రమాన్ని నిషేధిస్తున్నట్లు వారు ప్రకటించారు. బుధవారం స్థానిక తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఫ్యాక్టరీని తొలగిస్తేనే కులగణనలో పాల్గొంటామని తెలిపారు.

News November 6, 2024

నిర్మల్: విద్యార్థి మృతి పట్ల బీసీ శాఖ మంత్రి సంతాపం

image

దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామానికి చెందిన విద్యార్థి ఆయాన్ హుస్సేన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా విషయం తెలుసుకున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన సంతాపాన్ని తెలిపారు. విద్యార్థి కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు.