News July 15, 2024

ఆదిలాబాద్: ‘కేటాయించిన లక్ష్యాలను సాధించాలి’

image

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించబడిన అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాలని, రోజువారి నివేదిక టూర్ డైరీ మెయింటెన్ చెసి ప్రతీ నెల 5లోగా రిపోర్ట్ సమర్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వన మహోత్సవం సందర్భంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు. ప్రతీ రోజూ నాటిన మొక్కల వివరాలను పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలని అన్నారు.

Similar News

News November 22, 2025

ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

image

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్‌ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.

News November 22, 2025

నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

image

నార్నూర్‌లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్‌లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.