News August 1, 2024

ఆదిలాబాద్ కోర్టులో చరిత్రాత్మక కేసు విచారణ

image

ఆదిలాబాద్ జిల్లా కోర్టులో చరిత్రాత్మక కేసు విచారణ జరిగింది. వివరాలు..తాంసి మండలం జామిడికి చెందిన మునీశ్వర్ రాంబాయి, భగత్ సులోచన తలమడుగు PSలో ఓ ఘటనపై 2017 సం.లో ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పై ఇద్దరి బాధితుల సాక్ష్యం నమోదు చేయాలి. అయితే ఇద్దరు నడవలేని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతుండగా ఆటో సహాయంతో కోర్టు వరకు వచ్చారు. కాగా న్యాయమూర్తి దుర్గారాణి స్వయంగా వారివద్దకు వెళ్లి విచారణ చేపట్టారు.

Similar News

News September 18, 2025

ఆదిలాబాద్: ‘మిత్తి’మీరుతున్నారు..!

image

అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు అడ్డగోలు దందాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే లక్ష్యంగా.. రుణాలు ఇచ్చేటప్పుడు ఒక రేటు మాట్లాడి తిరిగి తీసుకునేటప్పుడు అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులకు బలవుతున్న వారిలో తాజాగా ఇంద్రవెల్లిలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో జిల్లా అంతటా పోలీసులు దాడులు చేసి సుమారు 30 మందిపై కేసులు నమోదు చేసినా, తీరు మారడం లేదు.

News September 18, 2025

పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాటశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో మండలాల వారిగా, పాఠశాల సముదాయాల వారీగా సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల వారీగా ఆగస్టు నెల సగటు విద్యార్థుల హాజరు నివేదికలు, టాప్ 5 పాఠశాలలు, అట్టడుగు 5 పాఠశాలలు, పాఠశాల కాంప్లెక్స్ వారీగా సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు.

News September 18, 2025

ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

image

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.