News September 19, 2024
ఆదిలాబాద్: క్రీడాకారుల వివరాలు ఇవ్వండి: DYSO
అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పతకాలు సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ పూర్తి వివరాలు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో ఈ నెల 23లోపు అందించాలని DYSO వేంకటేశ్వర్లు తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి వివరాలను పట్టిక రూపంలో పొందుపర్చనున్నారు. వివరాలకు ఆదిలాబాద్ క్రీడా పాఠశాల జూడో కోచ్ రాజును సంప్రదించాలన్నారు.
Similar News
News December 21, 2024
ఆసిఫాబాద్: 44 కేసులలో 59 మంది అరెస్ట్
అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా SPశ్రీనివాసరావు హెచ్చరించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు అక్రమంగా గుట్కాలు అమ్ముతున్న వారిలో 44 కేసులలో 59మందిని అరెస్ట్ చేసి, రూ.38,38152/-విలువగల గుట్కా రికవరీ చేశామన్నారు. PDS బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి లాంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
News December 21, 2024
మంచిర్యాల: బస్టాండ్ శుభ్రం చేయాలని మందుబాబులకు శిక్ష
ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ఈనెల 18న కోర్టులో హాజరు పర్చగా 2వ అదనపు మెజిస్ట్రేట్ మంచిర్యాల బస్టాండను 5 రోజుల (ఈనెల 20 నుంచి 24) వరకు శుభ్రం చేయాలని శిక్ష విధించారు. ఇది ఇలా ఉండగా మరో 22మందిని ఇవాళ కోర్టులో హాజరు పరచగా 14మందిని 5రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్ విధులు నిర్వర్తించాలని, మిగతా వారికి రూ.17500/-జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B.సత్యనారాయణ తెలిపారు.
News December 21, 2024
బెల్లంపల్లి: ‘కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపు’
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసుల దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ తెలంగాణ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కారు రేసింగ్ను చేపట్టగా అవకతవకలకు పాల్పడ్డారని కేసులు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు.