News September 19, 2024

ఆదిలాబాద్: క్రీడాకారుల వివరాలు ఇవ్వండి: DYSO

image

అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పతకాలు సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ పూర్తి వివరాలు జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ కార్యాలయంలో ఈ నెల 23లోపు అందించాలని DYSO వేంకటేశ్వర్లు తెలిపారు. 2019 నుంచి ఇప్పటి వరకు పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి వివరాలను పట్టిక రూపంలో పొందుపర్చనున్నారు. వివరాలకు ఆదిలాబాద్ క్రీడా పాఠశాల జూడో కోచ్ రాజును సంప్రదించాలన్నారు.

Similar News

News October 12, 2024

కుంటల: ఒకే ఊరిలో ఏడుగురికి ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో కుంటల మండలం కల్లూరు గ్రామానికి చెందిన ఏడుగురికి ప్రభుత్వ కొలువులు దక్కాయి. విశాల, సృజన, విజయలక్ష్మి, మహ్మద్, ప్రశాంత్, సంపత్, సాయికిరణ్ (SA) టీచర్లుగా నియామక పత్రాలు అందుకున్నారు. కల్లూరు ఉద్యోగుల సంఘం నేతలు వీరిని సన్మానించారు. ఒకే ఊరికి చెందిన ఏడుగురికి ఉద్యోగాలు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. MEO ముత్యం, పంచాయతి సెక్రటరీ సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

News October 11, 2024

మంచిర్యాల: ఒకే గ్రామంలో నలుగురికి టీచర్ ఉద్యోగాలు

image

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలోని నలుగురు డిఎస్సిలో ఒకే ప్రయత్నంలో టీచర్ ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఏకారి ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు పుప్పాల మానస, రవళి, మానస ముగ్గురు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ చదవించి ఉద్యోగాలు సాధించారు. ఒకే గ్రామం నుంచి నలుగురు టీచర్ ఉద్యోగాలు పోందినందుకు గ్రామస్థులు మిత్రులు అభినందించారు.

News October 11, 2024

ఆసిఫాబాద్: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం

image

అమర పోలీసుల జ్ఞాపకార్థం ఈనెల 21న జరుగు ‘పోలీస్ ప్లాగ్ డే’ సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ తీయడానికి జిల్లాలో ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SP మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్ 3 నిమిషాలు మించకూడదన్నారు. 10×8సైజు ఫోటోలను ఈనెల 24 వరకు స్థానిక పోలీస్ స్టేషన్, DSP కార్యాలయంలో అందించాలన్నారు. జిల్లా స్థాయిలో సెలక్ట్ అయిన 3షార్ట్ ఫిల్మ్‌ను స్టేట్ లెవెల్‌కు పంపిస్తామన్నారు.