News July 4, 2024

ఆదిలాబాద్: గుండెపోటుతో ఏఎస్సై మృతి

image

ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ఏఎస్సై యూనస్ ఖాన్ హైదరాబాద్‌లో గురువారం గుండెపోటుతో మృతి చెందారు. 1989 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల విధులు నిర్వర్తించారు. ఏఎస్సైగా పదోన్నతి పొంది హైదరాబాద్‌ సీఐడీ విభాగంలో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. గురువారం విధుల్లో ఉండగా సికింద్రాబాద్‌లోని ఆల్ఫా హోటల్‌ సమీపంలో గుండెపోటుతో ఆయన మృతి చెందాడు.

Similar News

News October 7, 2024

బెజ్జూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

News October 7, 2024

యోగా ఛాంపియన్షిప్‌లో జాతీయస్థాయికి బాసర విద్యార్థులు

image

TYSA ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెవులో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాశ్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదో సారి అని తెలిపారు. విద్యార్థులకు పలువురు అభినందించారు.

News October 7, 2024

నిర్మల్: రూ.7,33,999తో అమ్మవారి అలంకరణ

image

నిర్మల్ పట్టణంలోని ధ్యాగవాడ హనుమాన్ ఆలయంలో కొలువు దీరిన దుర్గా మాత మండపం వద్ద ఆదివారం రాత్రి అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అలంకరించారు. రూ.500, రూ.200, రూ.100 ఇతర నోట్లతో మొత్తం రూ .7,66,999తో అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు..