News May 6, 2024
ఆదిలాబాద్: గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో గుర్తుతెలియని <<13186266>>అస్థిపంజరం <<>>లభ్యమైన విషయం తెలిసిందే. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నిపాని గ్రామానికి చెందిన భూమన్న వారం క్రితం హనుమాన్ మాలధరించి అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అస్థిపంజరం పక్కన పురుగు మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. మృతదేహాన్ని కుక్కలు, అడవి పందులు పీక్కుతిన్నాయి. అస్థిపంజరం ముఖభాగం ఉండటంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 17, 2025
సర్వే పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్
లబ్ధిదారుల ఎంపికకు నిర్వహించే సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం ఆదిలాబాద్‌లోని అనుకుంటలో సర్వేను ఆయన మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పై సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను సేకరించారు. కమిషనర్ సీవీఎన్ రాజు, తదితరులున్నారు.
News January 16, 2025
ఆదిలాబాద్: రైతు భరోసా సర్వేకు 102 బృందాలు
ADB జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 62వేల పట్టా పాసు పుస్తకాలు ఉండగా ఆ డేటా ఆధారంగానే అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు. 102 క్లస్టర్లలో సర్వేకు 102 అధికార బృందాలు సిద్ధమయ్యాయి. ఇందులో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొంటారు. గతంలో సాగు అనువుకాని భూమికి సైతం రైతుబంధు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీగా సర్వే చేయనున్నట్లు వారు చెబుతున్నారు.
News January 16, 2025
ADB: మైనర్‌ను నమ్మించి అత్యాచారం చేశాడు..!
యువకుడిపై ADB పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. CI కర్ణాకర్ కథనం ప్రకారం.. ADBరిమ్స్‌లో చదువుతున్న బాలిక(17)కు INSTAGRAMలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన శివ పరిచయమయ్యాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో ఈనెల 9న HYDవెళ్లగా ఆమెను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆచూకీ తెలుసుకొని ADBరప్పించి ఆమె వాంగ్మూలం తీసుకొని కేసువేశారు.