News July 10, 2024
ఆదిలాబాద్: గ్రూప్ 1 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

గ్రూప్-I మెయిన్స్ కొసం ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్-I మెయిన్స్కు అర్హత పొందిన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce లో జులై 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ ఈనెల 22 నుంచి 75 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్లో 150, ఖమ్మంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
Similar News
News November 22, 2025
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.