News June 28, 2024
ఆదిలాబాద్: చైన్ స్నాచింగ్ దొంగలు అరెస్ట్

ఆదిలాబాద్ జిల్లాలో రెండు చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి ముగ్గురు దొంగలను పట్టుకున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. ఇటీవల తాంసీ, బేల పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళల మెడలో నుంచి చైన్లు దొంగతనం చేశారు. గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామానికి చెందిన అవినాష్, విభాష్, బజార్హత్నూర్‌కు చెందిన జాదవ్ ప్రదీప్ ముగ్గురితోపాటు ఒక బాల నేరస్థుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. బంగారం స్వాధీనం చేశారు.
Similar News
News February 24, 2026
ఆదిలాబాద్: రూ.1,000 కోట్లు ఎక్కడివి: కేటీఆర్

గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు ఏమి చేస్తున్నాయన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: సుమన్‌కు జైలు కొత్త కాదు: కేటీఆర్

మాజీ ఎంపీ, బాల్క సుమన్‌కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్‌తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.
News February 24, 2026
నేడు ఆదిలాబాద్‌కు కేటీఆర్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఇటీవల అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను 11 గంటలకు ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని జోగు రామన్న పిలుపునిచ్చారు.


