News September 5, 2024

ఆదిలాబాద్: జవహర్ నవోదయలో ప్రవేశాలు

image

2025-26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఎంపిక పరీక్ష ద్వారా ప్రవేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ నెల 16 లోపు www.navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 2025 జనవరి 18న పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కావున జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News September 17, 2024

ఆదిలాబాద్: ఆర్టీసీ గమ్యం యాప్‌పై ప్రయాణికులకు అవగాహన

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్ స్టేజ్ వద్ద ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆర్టీసీ సిబ్బంది మంగళవారం అవగాహన కల్పించారు. ఆర్టీసి గమ్యం యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా ప్రయాణించే బస్సు ఎక్కడ ఉన్నదో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ద్వారా కల్పిస్తున్న సేవలను వివరించారు. సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ యూసుఫ్, తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2024

SKZR: నవోదయ దరఖాస్తు గడువు పెంపు

image

కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పెంచినట్ల ప్రిన్సిపల్ కొడాలి పార్వతి తెలిపారు. ఈ నెల 16తో గడువు ముగియగా విద్యాలయ సమితి తిరిగి గడువు పెంచినట్లు పేర్కొన్నారు. కాగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 17, 2024

కాగజ్‌నగర్: లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూను వేలం పాటలో ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన అప్జల్- ముస్కాన్ దంపతులు రూ.13,216లకు వినాయకుని లడ్డూను వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు.