News November 10, 2024
ఆదిలాబాద్: జాతీయ స్థాయి పోటీల్లో హర్షవర్ధన్ సత్తా
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థి హర్షవర్ధన్ జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించాడు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో జరిగిన 68వజాతీయ స్థాయి SGF జూడో పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడని జూడో కోచ్ రాజు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతగా నిలవడం పట్ల పలువురు క్రీడా సంఘాల బాధ్యులు అభినందనలు తెలిపారు.
Similar News
News December 4, 2024
మంచిర్యాల జిల్లాలో భూకంపం
మంచిర్యాల జిల్లాలోని పలు చోట్ల బుధవారం భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నస్పూర్, జైపూర్, చెన్నూర్ ప్రాంతాల్లో ఉదయం 7.25 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనలతో ఒక్కసారిగా ఆందోళనలు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదు.
News December 4, 2024
కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. మంచిర్యాల వ్యక్తి మృతి
కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి బైకుపై ఇద్దరు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్‌కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారమిచ్చి గాయపడిన వ్యక్తిని KNR GOVT ఆసుపత్రికి తరలించారు..
News December 4, 2024
ADB: ‘పొగాకు ఉత్పత్తుల దుకాణాలు తొలగించాలి’
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, టీబీ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల 100 గజాల పరిధిలో ఉన్న పొగాకు ఉత్పత్తుల దుకాణాల తొలగించాలని సూచించారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం టీబీ పై సమీక్షించి జిల్లా కేంద్రంలోని ఇద్దరు బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు.