News March 20, 2025
ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్.. మూడ్రోజులు వర్షాలు

రానున్న మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం చేకూర్చనుంది. కానీ చేతికొస్తున్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 31, 2025
నార్నూర్: వచ్చే నెలలో పెళ్లి.. ఉగాది రోజే మృతి

నార్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన పవార్ సంగీత-ఉత్తమ్ దంపతుల కుమారుడు పవార్ శంకర్(22) ఆదివారం కెరమెరిలోని శంకర్ లొద్ది పుణ్య క్షేత్రానికి వెళ్లి వాగులో <<15940359>>ఈతకు వెళ్లి<<>> మృతిచెందాడు. శంకర్ ఉగాది రోజే మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. కాగా ఏప్రిల్‌లో అతడికి పెళ్లి నిర్ణయించినట్లు స్థానికులు తెలిపారు.
News March 31, 2025
ADB: స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందాలి: కలెక్టర్

స్వయం ఉపాధి పథకాల ద్వారా యువత లబ్ధి పొందాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అన్ని వర్గాల ప్రజలు, యువత దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆధార్, కుల, ఆధాయ, పాన్ కార్డ్, తదితర వివరాలను ఉపయోగించి https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News March 30, 2025
ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలు ఆపే అధికారం లేదు: DSP

ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలు ఆపే అధికారం లేదు అని డిఎస్పీ జీవన్ రెడ్డి అన్నారు. బోరజ్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న ఒక ఎంవీఐ అధికారి, ప్రైవేట్ డ్రైవర్ యుగంధర్చ ప్రైవేట్ వ్యక్తి వాహనాలు ఆపి ధ్రువపత్రాల అడగ్గా హైవే పెట్రోల్ గమనించి జైనథ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులు వాహనాలు ఆపిన, డబ్బులు వసూలు వారిపై చర్యలు తప్పవన్నారు.