News March 15, 2025

ఆదిలాబాద్ జిల్లాలో కత్తి పోట్ల కలకలం

image

ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం గూడ రాంపూర్‌లో శుక్రవారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా కత్తి పోట్లకు గురయ్యాడు. ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తాగిన మత్తులో ఘర్షణ జరిగినట్లు సమాచారం.

Similar News

News February 8, 2026

ADB: ఈ నెల 11న సెలవు

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11 (బుధవారం)న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆ రోజున మూసివేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

News February 7, 2026

ఉట్నూర్: పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించాలి

image

గిరిజన రైతులకు మల్బరీ పంట సాగుపై అలాగే పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించి, గిరిజన రైతులకు మంచి ఆదాయం వచ్చేలాగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలని ITDA PO యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శనివారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావలసిన రాయితీ వివరాలను వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

News February 7, 2026

ఈ నెల 9న సా.5 గంటలకు ప్రచారం బంద్: ADB కలెక్టర్

image

మున్సిపల్ పోలింగ్‌కు 48 గంటల ముందు అంటే ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు నిషేధమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా సినిమాలు, టీవీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.