News March 4, 2025

ఆదిలాబాద్ జిల్లాలో నేటి TOP News

image

*నేరడిగొండలో పేద యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసిన ఆడపడుచులు
*పుట్టపర్తిలో ఆదిలాబాద్ జిల్లా భక్తుల పర్తి యాత్ర
*సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభించకపోతే ఆందోళన చేస్తాం: జోగు రామన్న
*ఉన్నతాధికారుల జోక్యంతో ప్రారంభమైన పత్తికొనుగోళ్లు
*జిల్లాలో 38 డిగ్రీల ఎండ
*పోలీసు క్రీడాకారులను సత్కరించిన ఎస్పీ
*టీచర్ MLC ఎన్నికల్లో మల్క కొమురయ్య గెలుపు

Similar News

News March 15, 2025

ఎస్ఎస్సీలో 100% ఫలితాలు సాధించాలి: ఖుష్బూ గుప్తా

image

వచ్చే 10వ తరగతి పరీక్షల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థులు 100% పాస్ అయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా సూచించారు. శనివారం ఉట్నూర్ పీఎంఆర్సీ సమావేశం మందిరంలో ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థులు పరీక్షలు సాఫీగా రాసేలా చూడాలన్నారు. రాబోయే 20 రోజులు ఉపాధ్యాయులకు సెలవు ఉందడన్నారు.

News March 15, 2025

ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో AI బోధన

image

ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రైమరీ పాఠశాలల్లో శనివారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) బోధన ప్రారంభించనున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు. తలమడుగు మండలం దేవాపూర్ ప్రైమరీ స్కూల్ తెలుగు, ఉర్దూ మీడియం, కోడద్ ప్రైమరీ స్కూల్, ఆదిలాబాద్ అర్బనులోని తాటిగూడ ప్రైమరీ పాఠశాలల్లో ఈ AI ప్రోగ్రాం ఉండనుందని వెల్లడించారు.

News March 15, 2025

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం డీపీఓ కార్యాలయ సమీపంలో ఆటో, యాక్టివా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో గాయాలైన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో యాక్టివా పైన ప్రయాణిస్తున్న ఇద్దరు 15 ఏళ్ల బాలురుల తో పాటు మరో వ్యక్తి శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

error: Content is protected !!