News August 12, 2024
ఆదిలాబాద్ జిల్లాలో విద్యావలంటీర్లు అవసరం..!

ఉపాధ్యాయుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ బడుల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల పేరిట విద్యావాలంటీర్ల నియామకాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఇప్పటికే నారాయణపేట, వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈనేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోనూ VVల అవసరం ఎంతో ఉంది. ఈ విషయాన్ని కలెక్టర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తగు ప్రతిపాదనలు పంపించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
Similar News
News October 14, 2025
ఆదిలాబాద్: నైపుణ్యంతో న్యాక్ సర్టిఫికెట్స్

పనిలో వృత్తి నైపుణ్యం కలిగిన సర్టిఫికెట్ లేని అభ్యర్థులకు న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండు బ్యాచ్లకు ఒక రోజు RPL ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందించనున్నట్లు ట్రైనింగ్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ పొందుటకు శిక్షణ రుసుం రూ.1,200 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9154548063 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
News October 13, 2025
ఆదిలాబాద్లో బంగారు ధర రికార్డు

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.
News October 13, 2025
ఆదిలాబాద్లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణం

ఆదిలాబాద్లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణాన్ని బయట పట్టినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సూర్య రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈడీ, ఎస్బీఐ మార్టగేజ్ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన ముఠాలో నిందితులు రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అరెస్టు చేశామన్నారు. అదేవిధంగా యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్, మనోజ్ కుమార్, పూనం, అనుపమ, శివాజీపై కేసు చేశామన్నారు.