News March 17, 2025
ఆదిలాబాద్: జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి K.ప్రభాకర్ రావు, అదనపు డిస్ట్రిక్ట్ సెక్షన్స్ జడ్జి డాక్టర్ పి.శివరాంప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై చర్చించారు. రానున్న లోక్ అదాలత్ లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కరించే దిశగా కృషి చేయాలని చర్చించుకున్నారు.
Similar News
News October 16, 2025
ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
News October 16, 2025
ADB: సపోర్ట్ ఇంజినీర్ పోస్టుకు దరఖాస్తులు

సపోర్ట్ ఇంజినీర్ పోస్టును అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అర్హతలు బీటెక్/ఎంసీఏ, టెక్నికల్ సపోర్ట్లో నాలుగేళ్ల అనుభవం ఉండాలన్నారు. నెలకు రూ.35,000 చెల్లిస్తామని తెలిపారు. అగ్రిగేట్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. 2025 జులై 1 నాటికి కనీస వయస్సు 18, గరిష్టంగా 46 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుందన్నారు.
News October 16, 2025
ADB: మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

ఆదిలాబాద్లోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యాలయ మేనేజ్మెంట్ కమిటీ (VMC) సమావేశానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి లక్ష్యాలు, సన్నద్ధత, ప్రోత్సాహక విషయాలపై పలు సూచనలు చేశారు.