News June 1, 2024

ఆదిలాబాద్: జూన్ 2 నుంచి అందుబాటులోకి 90 వేల ప్యాకెట్లు

image

రైతులు కోరుకుంటున్న రాశీ 659 పత్తి విత్తనాలను గత సంవత్సరం కంటే ఎక్కువ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 1.50 లక్షల ప్యాకెట్లను కంపెనీని నుంచి తెప్పిస్తున్నామని, ఇప్పటి వరకు రైతులు 60 వేల ప్యాకెట్లు కొనుగోలు చేశారన్నారు. జూన్ 2 నుంచి మరో 90 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దశల వారీగా రాశీ 659 స్టాకు వస్తుందని స్పష్టం చేశారు.

Similar News

News September 9, 2024

అసౌకర్యాలకు నిలయంగా కుంటాల జలపాతం

image

నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం వద్ద కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు వేదన అనుభవిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి గదులు లేవు. మెట్ల మార్గంలో కనీసం సేద తీరే పరిస్థితి లేదు. మార్గమధ్యలో వర్షం కురిస్తే పూర్తిగా తడిసి పోవాల్సిందే. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతరులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జలపాతం వద్ద మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

News September 9, 2024

ఆదిలాబాద్: DEGREEలో చేరేందుకు నేడే ఆఖరు

image

DOST ద్వారా DEGREE కళాశాలలో స్పెషల్ ఫెజ్ ద్వార ప్రవేశాలు పొందేందుకు నేడు చివరి తేదీ అని ఆదిలాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సంగీత పేర్కొన్నారు. SEP 9 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని SEP 4 నుంచి 9 వరకు వెబ్ అప్షన్ పెట్టుకోవాలన్నారు. SEP 11న సీట్ల కేటాయింపు ఉంటుందని SEP 11 నుంచి 13 వరకు ఆన్ లైన్ పేమెంట్ పూర్తి చేయాలని, SEP 12 నుంచి 13లోపు కళాశాలలో రిపోర్ట్ చేయాలని వెల్లడించారు. 

News September 9, 2024

ADB: తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొడుకు ఆత్మహత్య

image

కోర్టులో తన తండ్రికి శిక్ష పడుతుందేమో అన్న భయంతో కొడుకు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన జైనథ్ మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. గూడ రాంపూర్‌కు చెందిన దేవన్నపై జైనథ్ PSలో గతంలో అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి నేటి నుంచి వాదనలు ప్రారంభంకానున్నాయి. తండ్రికి శిక్ష పడుతుందేమోనని కొన్ని రోజులుగా కుంగిపోతున్న కొడుకు బండారి సంతోశ్(15)ఈ నెల 6న ఆత్మహత్య చేసుకున్నాడు.