News May 4, 2024
ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారం.. అధికారుల క్లారిటీ

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News December 11, 2025
ఆదిలాబాద్: గ్రామాల్లో ఉత్కంఠ.. ఓటేసేందుకు రెడీనా?

జిల్లాలో తొలివిడతలో 6 మం. పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంద్రవెల్లి(29), నార్నూర్(24), ఉట్నూర్(38), సిరికొండ(18) గాదిగూడ(25), ఇచ్చోడ(33) మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 167 గ్రామాలు ఉన్నాయి. ఎలాంటి ఘటనలను జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. మ. 2గంటల నుంచి ఫలితాలు వెల్లడికానున్నాయి.
> GP ఎన్నికల అప్‌డేట్స్ కోసం Way2Newsను ఫాలో అవ్వండి
News December 11, 2025
నిర్భయంగా ఓటేయండి: ఆదిలాబాద్ ఎస్పీ

ఇప్పటివరకు 38 గ్రామాలలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ప్రజలను ఓటు హక్కుపై అవగాహన కల్పించామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు గురి కాకూడదని తెలిపారు. గొడవలకు అల్లర్లకు దారి తీయకుండా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకొని ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేలా ప్రజలు అందరు సహకరించాలని కోరారు.