News June 5, 2024

ఆదిలాబాద్: డిపాజిట్ కోల్పోయిన బీఆర్ఎస్ అభ్యర్థి

image

ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రంసక్కు డిపాజిట్ కోల్పోయారు. ఈయనకు ఈవీఎం ద్వారా 1,36,463 , పోస్టల్ బ్యాలెట్ 837, మెత్తంగా 1,37,300(11.11%) ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ధరావత్ కోల్పోయారు. కాగా ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన గోడం నగేశ్ కు 5,68,168 ఓట్లు (45.98%)వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సుగుణకు 4,77,516 (38.65%) ఓట్లు వచ్చాయి.

Similar News

News December 4, 2025

ADB: సీఎం పర్యటన.. ఎన్నికల స్టంట్ ఏనా..?

image

పంచాయతీ ఎన్నికల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించడంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లాకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాకు వచ్చి ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అందుకే పట్టణంలో ఎన్నికల నియమావళి ఉండదని అక్కడ సీఎం సభ పెట్టారని మండిపడుతున్నారు.

నార్నూర్‌లో 6, గాదిగూడలో 4 సర్పంచ్‌లు ఏకీగ్రీవం

image

మొదటి విడుత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో‌ ముగిసింది. నార్నూర్ మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలకు గాను గంగాపూర్, జామ్డా, ఖంపూర్, మహాగావ్, మాన్కాపూర్, మాలేపూర్ మొత్తం 6 సర్పంచ్‌లు, 198 వార్డులకు గాను 157 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. గాదిగుడలో మొత్తం 4 గ్రామపంచాయతీలు, 196 వార్డులకు గాను 181 ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు.