News June 30, 2024
ఆదిలాబాద్: డీఈడీ దరఖాస్తుకు నేడే LAST.. 10న పరీక్ష

DED కళాశాలలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం జున్ 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఆసక్తి గల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జులై 10న ఆన్లైన్ లో ఉంటుందని పేర్కొన్నారు. ఎడిట్ ఆప్షన్ నేటితో ముగుస్తుందని తెలిపారు. పూర్తి వివరాలకు htpp://deecet.cdse. telangana. gov.in ను సందర్శించాలని సూచించారు.
Similar News
News December 10, 2025
ADB: 166 సర్పంచ్, 1392 వార్డ్ స్థానాలకు ఎన్నికలు

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 6 మండలాల్లో 166 సర్పంచ్, 1392 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోలింగ్ సామగ్రి పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. సరిపడినంత సిబ్బందిని నియమించడంతో పాటు వారికి శిక్షణ పూర్తి చేశామని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు.
News December 9, 2025
ADB: ప్రచారం ముగిసింది.. పోలింగ్ మిగిలింది

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి సెక్షన్ 163 BNSS అమలులోకి వస్తుందని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని పేర్కొన్నారు. ఇప్పటి నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఆ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలన్నారు. పోలింగ్ డిసెంబర్ 11 ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని, అదే రోజు ఫలితాలు వస్తాయన్నారు.
News December 9, 2025
ఆదిలాబాద్: “నేను మీ అభ్యర్థినే.. నాకెందుకు చేయరు ప్రచారం..”

ఉమ్మడి ఆదిలాబాద్లోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారానికి వెళ్ళినప్పుడు సొంత పార్టీ నుంచి రెబల్గా పోటీలో ఉన్నవారు వారిని ఇరకాటంలో పెడుతున్నారు. “మేము కూడా మీ పార్టీనే. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం. ఇప్పుడు మీరు మాకు ఎందుకు మద్దతు ఇవ్వరు. మాకు కూడా ప్రచారం చేయండి” అని అడగడంతో నాయకులు తలలు పట్టుకుంటున్నారు.


